Thursday, December 11, 2014

Telugu lyrics Rama Chakkani Seetaki Song from Godavari



Song Name :Rama Chakkani Seetaki.
Movie:Godavari
Singers:Gayathri
Lyricist:Veturi Sundararama Murthy
Composer:K M Radhakrishnan
Director:Shekhar Kammula




ఆలాపన:
నీల గగన ఘనవిచలన..
ధరణిజ శ్రీ రమణ
ఆ.. ఆ...ఆ ..
మధుర వదన నళిన నయన
మనవి వినరా రామా..

పల్లవి:
రామ చక్కని సీతకి
అరచేత గోరింట..
ఇంత చక్కని చుక్కకీ..
ఇంకెవడో మొగుడంట..
రామ చక్కని సీతకీ..

చరణం1:
ఉడత వీపున వేలు విడిచిన 
పుడమి అల్లుడు రాముడే.. 
ఎడమ చేతను శివుని విల్లును 
ఎత్తిన ఆ రాముడే..
ఎత్తగలడా సీత జడనూ 
తాళి కట్టే వేళలో..??
రామ చక్కని సీతకీ..

చరణం2:
ఎర్రజాబిలి చేయిగిల్లి
రాముడేడని అడుగుతుంటే..
చూడలేదని పెదవి చెప్పే..
చెప్పలేమని కనులు చెప్పే..
నల్లపూసైనాడు దేవుడు 
నల్లనీ రఘురాముడూ..
రామ చక్కని సీతకీ..

చరణం3:
చుక్కనడిగా దిక్కునడిగా..
చెమ్మగిల్లిన చూపునడిగా..
నీరు పొంగిన కనులలోన
నీటి తెరలే అడ్డునిలిచే...
చూసుకోమని మనసు తెలిపే..
మనసు మాటలు కాదుగా..
రామ చక్కని సీతకి
అరచేత గోరింట..
ఇంత చక్కని చుక్కకీ..
ఇంక ఎవడో మొగుడంట..
రామ చక్కని సీతకీ..

ఇందువదన కుందరదన మందగమన భామా.. 
ఇందువలనా ఇందువదనా.. ఇంత మదనా?? ప్రేమా?

English :
nIla gagana Ganavicalana..
dharaNija SrI ramaNa
A.. A...A ..
madhura vadana naLina nayana
manavi vinarA rAmA..

pallavi:
rAma cakkani sItaki
aracEta gOrimTa..
imta cakkani cukkakI..
imkevaDO moguDamTa..
rAma cakkani sItakI..

caraNam1:
uData vIpuna vElu viDicina puDami alluDu rAmuDE..
eDama cEtanu Sivuni villunu ettina A rAmuDE..
ettagalaDA sIta jaDanU tALi kaTTE vELalO..??
rAma cakkani sItakI..

caraNam2:
errajAbili cEyigilli
rAmuDEDani aDugutumTE..
cUDalEdani pedavi ceppE..
ceppalEmani kanulu ceppE..
nallapUseinADu dEvuDu
nallanI raghurAmuDU..
rAma cakkani sItakI..

caraNam3:
cukkanaDigA dikkunaDigA..
cemmagillina cUpunaDigaa..
nIru pomgina kanulalOna
nITi teralE aDDunilicE..
cUsukOmani manasu telipE..
manasu mATalu kAdugA..

rAma cakkani sItaki
aracEta gOrimTa..
imta cakkani cukkakI..
imka evaDO moguDamTa..
rAma cakkani sItakI..

imduvadana kumdaradana mamdagamana bhaamaa..
imduvalanA imduvadanA.. imta madanA?? prEmaa?

Watch the song HERE

Thursday, November 27, 2014

Century lu kotte [సెంచరీలు కొట్టే] from Aditya 369


Song Name :Century lu kotte..
Movie:Aditya 369
Singers:S.P. Balu, S.Janaki
Lyricist:Veturi Sundararama Murthy
Composer:Ilayaraja
DirectorSingeetam Srinivasa Rao




ఆలాపన (గుస గుస):
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ..
బౌండరీలు దాటే మనస్సు మాదీ..

పల్లవి:

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ.. 
బౌండరీలు దాటే మనస్సు మాదీ..
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ..
బౌండరీలు దాటే మనస్సు మాదీ..
చాకిరీలనైనా మజామజావళీలు చేసి
పాడు సోలో.. ఇక ఆడియోలో
వీడియోలో..చెలి జోడియోలో..
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ..
బౌండరీలు దాటే మనస్సు మాదీ..

చరణం1:
మేఘమాలనంటుకున్న యాంటెనాలతో..
మెరుపుతీగ మీటిచూడు తందనాలతో..
సందెపొద్దు వెన్నెలంటు చందనాలతో.. 
వలపు వేణువూది చూడు వందనాలతో.. 
చక్రవాక వర్షగీతి వసంతవేళ పాడు
తుళ్ళిపడ్డ ఈడుజోడు తుఫానులో..
కన్నెపిల్ల వాలుచూపు కరెంటు షాకుతిన్న
కుర్రవాళ్ళ ఈలపాట ఉషారులో..
లైఫు వింత డాన్సు.. లిఖించు కొత్త ట్యూన్సు..
ఉన్నదొక్క ఛాన్సు సుఖించమంది సైన్సు..
వాయులీన హాయిగాన రాగమాలలల్లుకున్నవేళ..

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ.. 
బౌండరీలు దాటే మనస్సు మాదీ..
చాకిరీలనైనా మజామజావళీలు చేసి 
పాడు సోలో.. ఇక ఆడియోలో
వీడియోలో..చెలి జోడియోలో..
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ.. 
బౌండరీలు దాటే మనస్సు మాదీ..

చరణం2: 
వెచ్చనైన ఈడుకున్న వేవులెంక్తు లో
రెచ్చి రాసుకున్న పాటకెన్ని పంక్తులో...
విచ్చుకున్న పొద్దుపూవు ముద్దు తోటలో..
కోకిలమ్మ పాటకెన్ని కొత్త గొంతులో..
ఫాక్సుట్రాటు బీటు మీద పదాలు వేసిచూడు..
హార్టు బీటు కలుపుకున్న లిరిక్కులో..
కూచిపూడి గజ్జెమీద ఖవాలి పాడిచూడు 
కమ్ముకున్న కౌగిలింత కథక్కులో..
నిన్న మొన్న కన్నా.. నిజనిజాలకన్నా..
గతాగతాల కన్నా.. ఇవాళనీది కన్నా..
పాటలన్ని పూవులైన తోట లాంటి లేత యవ్వనాన..

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ.. 
బౌండరీలు దాటే మనస్సు మాదీ..
చాకిరీలనైనా మజామజావళీలు చేసి
పాడు సోలో.. ఇక ఆడియోలో
వీడియోలో..చెలి జోడియోలో..
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ.. 
బౌండరీలు దాటే మనస్సు మాదీ..

జింగిచాకు చచ్చ జిజిక్కుచాచా..
జింగిచాకు చచ్చ జిజిక్కుచాచా..

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ from Aditya 369 review



సరదాగా సాగిపోయే ఈ పాట గురించి సరదాగా కాసేపు..
అవసరమైన చోటల్లా అలంకారాలతో పాటని అలంకరించడం మన వేటూరి గారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో కదా!!
అలాగే పాటల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో కూడా గురువుగారు దిట్ట అని కొత్తగా చెప్పక్కరలేదేమో!!
ఇక ఈ పాట ని ఎంజాయ్ చేస్తూ కాస్త వేటూరి గారి గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కథ ప్రకారం.. కాలేజి లో స్టూడెంట్స్ సరదాగా పాడుకునే పాట ఇది..
వాళ్ల వయసులో ఉండే ఊపు, ఏదైనా చేయగలం అనే ఉత్సాహం..మాకు హద్దులు లేవు అన్న హుషారు.. ఈ పాట లో ప్రతిబింబించారు..
అందుకు నాంది గా పల్లవి ఎత్తుకున్నారు..
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ..
బౌండరీలు దాటే మనస్సు మాదీ..
ఈ రెండు లైన్ల లో పైన చెప్పినవి అన్నీ కవర్ చేసేసారు..
కానీ వూరికే చెప్పేస్తే ఎలా.. బాష మీద ప్రేమ కూడా చూపించాలిగా.. అందుకే..
చాకిరీలనైనా మజామజావళీలు చేసి
పాడు సోలో.. ఇక ఆడియోలో
వీడియోలో..చెలి జోడియోలో..
అన్నారు..
మజా ని జావళి గా మార్చి అన్న దాన్ని మజామజావళీ చేసేసారు..
చెలి జోడియోలో.. అన్నది ప్రాస కోసం చేసిన మంచి ప్రయోగం గా చెప్పొచ్చు..
ఇక చరణాల లోకి వస్తే ప్రతీ లైను ఒక మంచి ప్రయోగం తో కూడుకున్నవే..
మేఘమాలనంటుతున్న యాంటెనాలతో..
మెరుపుతీగ మీటిచూడు తందనాలతో..
ఆహా.. ఎంత చక్కని ఊహ.. అర్థం కాని వారికి ఏంటో ఇది అనిపిస్తుంది.. అర్థం చేసుకుంటే ఆయన గొప్పతనం తెలుస్తుంది..
తర్వాతి రెండు లైన్లు చక్కని ప్రాసతో నడుస్తాయి..
మెరుపుతీగ మీటిచూడు తందనాలతో..
సందెపొద్దు వెన్నెలంటు చందనాలతో..
వలపు వేణువూది చూడు వందనాలతో..
తందనాలతో..చందనాలతో.. వందనాలతో.. వీటిని తన పాటల్లో తరుచూ వినిపించే వెన్నెల, వలపు, వేణువు తో కలిపారు..
ఇప్పుడు కూడా కొంతమంది ప్రాసకోసమే పడిచచ్చిపోయే వాళ్ళలాగా రాస్తారు గాని.. అవి అర్థవంతం గా ఉండి చావవు.. తెలుగుని చింపేసి చంపేసి.. విన్నవాళ్లకి చావాలి అనిపించేలా చేస్తూంటారు.. సర్లె వాళ్ల గురించి ఇపుడు ఎందుకులే..
తర్వాత లైన్ లో..
చక్రవాక వర్షగీతి వసంతవేళ పాడు
తుళ్లిపడ్డ ఈడుజోడు తుఫానులో..
వర్షం పడుతున్నప్పుడు చక్రవాక పక్షి పాడే పాటకి, జంటలు తుఫాను లా అల్లరి చేస్తూ రెచ్చిపోతారు అని కాబోలు..
లేదా
చక్రవాకం అనే రాగం లో మంచి వాన పాట వస్తుంటే అమ్మాయి అబ్బాయి ల హుషారు తుఫాను లా చెలరేగింది అని కాబోలు..
చక్రవాకం అంటే ఇక్కడ పక్షి అనా.. లేక రాగం అనా..?
అర్థం చేసుకున్న వాళ్లకి అర్థం చేసుకున్నంత.. నేనెంత వాడిని సరిగ్గా ఆయన భావం ఊహించడానికి?
లైఫు వింత డాన్సు.. లిఖించు కొత్త ట్యూన్సు..
ఉన్నదొక్క ఛాన్సు సుఖించమంది సైన్సు..
జీవితం చాలా చిన్నదనీ.. ఎల్లప్పుడూ మూస పధ్ధతే కాక ప్రయోగాలు చేయాలనీ..అవకాశం ఉన్నప్పుడే వినియోగించుకోవాలి అన్న తత్వాన్ని (సైన్స్ - శాస్త్రం) జొప్పించేసారు ఈలోపే.. చక్కని ప్రాస తో సహా
ఒక ఇంటర్వ్యూ లో ఆయనే స్వయంగా చెబితే విన్నా.. పాటలో అవకాశం దొరికితే ఏదైనా సందేశం చెప్పాలి వూరికే కొన్ని లైన్లు పదాలతో నింపేయడం కాదు అని.. అది ఇదేనేమో!
తరవాత లైన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే..
వాయులీన హాయిగాన రాగమాలలల్లుకున్నవేళ..
వినసొంపైన చక్కని వయొలిన్ గానాలు మనచూట్టూ నిండినపుడు.. అని అర్థం..
ఇళయరాజా గారి స్వరం గెలుస్తుందా.. వేటూరి గారి పదం గెలుస్తుందా అన్న దానికి ఈ లైను చక్కని వేదిక.. అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నా.. నాకు ఇద్దరూ ఇష్టమే కాబట్టి..
రెండో చరణం మరిన్ని ప్రయోగాలకు నిలయం..
వెచ్చనైన ఈడుకున్న వేవులెంక్తు లో
రెచ్చి రాసుకున్న పాటకెన్ని పంక్తులో...
ఒక ఇంగ్లీషు పదానికి మరొక అచ్చ తెలుగు పదానికి సందర్బానుసారంగా అర్థవంతంగా..ఇంతకన్నా మంచి అంత్య ప్రాస దొరకదేమో అన్నట్లు ఉంటుంది..ఈ లైన్
వేడెక్కి ఉన్న ఈ వయసులో భావాల్ని పాటగా రాస్తే.. ఆ పాట ఎంత రాసినా అయిపోదు అని..
విచ్చుకున్న పొద్దుపూవు ముద్దు తోటలో..
కోకిలమ్మ పాటకెన్ని కొత్త గొంతులో..
ఉదయాన్నే లేచే సరికి కొత్త ఉత్సాహం తో కోకిల పాటలు పాడుతుంది..
ఐతే ఇక్కడ ఆ ఉదయాన్ని ముద్దు పూల తోట గా వర్ణించడం కవిత్వం ఐతే..
కోకిలమ్మ గొంతుకి ఎన్ని కొత్త పాటలు వస్తాయో అనకుండా.. కోకిలమ్మ పాటకి ఎన్ని కొత్త గొంతులు వస్తాయో కదా అనడం వేటూరి మార్క్ ప్రయోగం..
వేటూరి గారికి యమక గమకాలంటే ఎంత ఇష్టమో తెలిసిందే.. అందుకే ఇక్కడ కూడా ఒకటి వేసారు..
గతాగతాల కన్నా.. ఇవాళనీది కన్నా..
ఇది ఒక చక్కని యమకాలంకారం.. మొదటి "కన్నా" అనేది పోల్చడం ఐతే.. రెండో "కన్నా" అనేది అబ్బాయి ని సంభోదించడం..
మొదటి చరణం లాగానే రెండో చరణం లో కూడా ఒక మంచి లైన్..
పాటలన్ని పూవులైన తోట లాంటి లేత యవ్వనాన..
ఈ యవ్వనం అనేది ఒక పూదోట అంట.. అందులో పువ్వులు ఎమిటీ అంటే పాటలేనట..
ఆయన కలం పట్టుకుంటేనే అక్షరాలు ఇల జాలువారతాయేమో కదా..!!!
వేటూరి గారి పాద పద్మాలకు నమస్కారం...

Wednesday, November 26, 2014

Odanu Jaripe muchchata kanare from Rajeswari Kalyanam

Song Name :Odanu Jaripe..
Movie:Rajeswari Kalyanam
Singers:S.P. Balu, Chitra
Lyricist:Veturi Sundararama Murthy
Composer:M.M.Keeravani
DirectorKranthi Kumar




పల్లవి:
ఓడను జరిపే ముచ్చట కనరే..
వనితలారా నేడూ...
ఓడను జరిపే ముచ్చట కనరే..
వనితలారా నేడూ...
ఆడువారు యమునకాడా...ఆ ఆ ఆ...
ఆడువారు యమునకాడ కృష్ణుని కూడి..
ఆడుచు పాడుచు అందరూ చూడగా...
ఓడను జరిపే ముచ్చట కనరే..ఏ.. 

చరణం1:
వలపుతడీ తిరనాలే.. పొంగిన యేటికి అందం..
కెరటాలకు వయ్యారం.. కరిగే తీరం..
తిలకమిడీ.. కిరణాలే..పొద్దుటి తూరుపుకందం.
చినదానికి సింగారం.. సిగమందారం..
పదాల మీదే పడవ.. పెదాలు కోరే గొడవ..
ఎదల్లో మోగే దరువే.. కదంగానావే నడవ.. 
ఇలా నీలాటిరేవులో..

ఓడను జరిపే ముచ్చట కనరే..
వనితలారా నేడూ...
ఓడను జరిపే ముచ్చట కనరే..
వనితలారా నేడూ...

చరణం2:
చిలిపితడీ వెన్నలలే గౌతమి కౌగిలికందం..
తొలిజోలకు శ్రీకారం.. నడకే భారం..
ఉలికిపడే ఊయలలే.. కన్నుల పాపలకందం..
నెలవంకల శీమంతం ఒడిలో దీపం..
తరాలు మారే జతలే.. స్వరాలు పాడే కథలో..
సగాలై పోయే మనువే సృజించే మూడో తనువే..
త్యాగయ్య రామ లాలిలో..

ఓడను జరిపే ముచ్చట కనరే..
వనితలారా నేడూ...
ఓడను జరిపే ముచ్చట కనరే..

Tuesday, November 25, 2014

Pranathi Pranathi song from Swathi Kiranam movie


Song Name:Pranathi Pranathi
Movie:Swathi Kiranam
Singers:S.P.Balu, Vani Jayaram
Lyricist:Sirivennela Seetarama Sasthri
Composer:K.V.Mahadevan
Director:K.Viswanath




ఆలాపన:
సా రీ.. గ మ ప మ గ మ సరిరీసా..
పమగమసరిసా... రీ
గ మ పనిసని పమగమ సరిరీసా.. 

పల్లవి:
ప్రణతి ప్రణతి ప్రణతీ 
పమప మగమ సరి సా.. 
ప్రణతి ప్రణతి ప్రణతీ 
ప్రణవనాద జగతికీ..
మమప మమప మప నీ..
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ
ప్రధమ కళా సృష్టికీ..
ప్రణతి ప్రణతి ప్రణతీ 
ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ..

చరణం1:
పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం..
ఓంకారమా...
సుప్రభాత వేదిక పై.. శుకపికాది కలరవం..
ఐంకారమా...
పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం..
ఓంకారమా...
సుప్రభాత వేదిక పై.. (పసససాస పానిపమా..)శుకపికాది కలరవం..
ఐంకారమా... 
పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా...
హ్రీంకారమా...
గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడీ శ్రీంకారమా..
శ్రీంకారమా..
ఆ బీజాక్షర విఘటికీ అర్పించే జ్యోతలివే.. (ఓం ఐం హ్రీం శ్రీం) 

ప్రణతి ప్రణతి ప్రణతీ 
ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ..

చరణం2:
పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన 
అది కవనమా..
మగ మపాపపప మపాపాపపప  నిపప నిపపప నిపాపాపపమ మపమపమ గా..
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన ఖేలనా..
అది నటనమా..
అది నటనమా..
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖనా..
అది చిత్రమా..
అది చిత్రమా..
ఆ.ఆ..ఆ. 
మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పన..
అది శిల్పమా..
అది శిల్పమా..
అది శిల్పమా..
అది శిల్పమా..
ఆ లలిత కళా సృష్ఠికీ అర్పించే జ్యోతలివే.. 

ప్రణతి ప్రణతి ప్రణతీ 
ప్రణవనాద జగతికీ.
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ 
ప్రధమ కళా సృష్టికీ..
ప్రణతి ప్రణతి ప్రణతీ ...
ప్రణవనాద జగతికీ.ఈ.ఈ.ఈ...

Subhalekha Rasukunna from Kondaveeti Donga

Song Name :Subhalekha Rasukunna..
Movie:Kondaveeti Donga
Singers:S.P. Balu, Chitra
Lyricist:Veturi Sundararama Murthy
Composer:Ilayaraja
Director:Kodandarami Reddy
Legend:
Blue : Male
Pink : Female


పల్లవి:

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
అదినీకు పంపుకున్నా అపుడే కలలో..
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో..
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో..

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..
తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో..
శారద మల్లెల పూలజల్లే.. వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా.. కన్నులతో...

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో..

చరణం1: 
చైత్రమాసమొచ్చెనేమో.. చిత్రమైన ప్రేమకి..
కోయిలమ్మ పూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి..
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి
మల్లె మబ్బులాడెనేమో బాల నీలవేణికీ.. 

మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు..
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలూ..
అంతేలే.. కథంతేలే.. అదంతేలే...

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..
తొలిముద్దు జాబు రాసా చెలికే ఎపుడో..
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో..
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో..

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..

చరణం 2:
హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో..
రాధ లాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచి ఉన్నా వేణుపూల తోటలో..

వాలుచూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలూ..
వోళ్లో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలూ..
అంతేలే.. కథంతేలే.. అదంతేలే...

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
అదినీకు పంపుకున్నా అపుడే కలలో..
శారద మల్లెల పూలజల్లే.. వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా.. కన్నులతో...

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో..
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో..

Entha Entha Vintha Mohamo from Bhairava Dweepam..



Song Name:Entha Entha Vintha Mohamo
Movie:Bhairava Dweepam
Singers:S.P.Balu, Sandhya
Lyricist:Sirivennela Seetarama Sastry
Composer:Madhavapeddi Ramesh
Director:Singeetam Srinivasarao 



ఆలాపన :
చందమామ వచ్చినా చల్లగాలి వీచినా...
చిచ్చు ఆరదేలనమ్మా..
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా...
చందనాలు పూసినా ఎంత సేవ చేసినా...
చింత తీరదేలనమ్మా? 
ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా...
జంట లేదనా..?? హా.. హా..హా...
ఇంత వేదనా..?? హో.. హో... హో...
జంట లేదనా.. ఇంత వేదనా.. 
ఎంత చిన్నబోతివమ్మా... ఆ...

చందమామ వచ్చినా చల్లగాలి వీచినా...
చిచ్చు ఆరదేలనమ్మా..
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా...
ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా...

ఓ ఓ ఓ.... మురిపాల మల్లికా....
దరిజేరుకుంటినే... పరువాల వల్లికా...
ఇది మరులుగొన్న మహిమో...
నిను మరువలేని మైకమో...

పల్లవి: 
ఎంత ఎంత వింత మోహమో...
రతి కాంతుని శృంగార మంత్రమో..  
ఎంత ఎంత వింత మోహమో...
రతి కాంతుని శృంగార మంత్రమో.. 
మరు మల్లెల సరమో..
విరి విల్లుల శరమో..
మరు మల్లెల సరమో..
విరి విల్లుల శరమో..
ప్రణయానుబంధమెంత చిత్రమో..

ఎంత ఎంత వింత మోహమో...
రతి కాంతుని శృంగార మంత్రమో.. 

చరణం1:
విరిసిన వనము యవ్వనము..
పిలిచింది చిలిపి వేడుకా...
కిలకిల పాట గా... 
చలువల వరము.. కలవరము..
తరిమింది తీపి కోరికా
చెలువను చూడగా..
దరిశనమీయవే.. సరసకు చేరగా...
తెరలను తీయవే.. తళుకుల తారకా..
మదనుడి లేఖ, శశి రేఖ, అభిసారికా..

ఎంత ఎంత వింత మోహమో...
రతి కాంతుని శృంగార మంత్రమో.

చరణం 2:
కలలను రేపే కళ ఉంది..
అలివేణి కంటి సైగలో..
జిగిబిగి సోకులో..
ఎడదను ఊపే ఒడుపుంది..
సుమబాల తీగమేనిలో
సొగసుల త్రావి లో..
కదలని ఆటగా.. నిలిచిన వేడుకా..
బదులిడరావుగా.. పిలిచిన కోరికా.. 
బిడియమదేల, ప్రియురాలా, మణిమేఖలా...

ఎంత ఎంత వింత మోహమో...
రతి కాంతుని శృంగార మంత్రమో..  
మరు మల్లెల సరమో..
విరి విల్లుల శరమో.. 
మరు మల్లెల సరమో..
విరి విల్లుల శరమో..
ప్రణయానుబంధమెంత చిత్రమో..

ఎంత ఎంత వింత మోహమో...
రతి కాంతుని శృంగార మంత్రమో..

Watch the song in Youtube Here